
హైడ్రాకు హైకోర్టు వార్నింగ్..! ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోం అంటున్న హైకోర్టు హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటు చేసిన హైడ్రా దూకుడు కొనసాగుతోంది. అక్రమంగా నిర్మించిన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది. ఎక్కడికక్కడ కూల్చివేతలతో అక్రమార్కుల గుండెల్లో బుల్డొజర్లు దింపుతోంది. ఈ క్రమంలో.. హైడ్రా కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హైడ్రాకు హైకోర్టు వార్నింగ్ కూడా ఇచ్చింది. సెలవు దినాల్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టిందంటూ ఓ బాధితులు వేసిన పిటిషన్‌పై మరోసారి విచారణ చేపట్టిన జస్టిస్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం.. హైడ్రా అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
హైడ్రా కూల్చివేతలపై స్పందించిన హైకోర్టు “మీ ఇష్టం వచ్చినట్లు కూల్చివేతలు చేపడతారా..? సెలవు దినాల్లో కూల్చివేతలు చట్టవిరుద్ధమని చెప్పినా నిబంధనలు పాటించరా..? న్యాయస్థానం ఆదేశాలంటే లెక్కలేకుండా వ్యవహరిస్తే.. అది తెలిసేలా చేస్తాం. ఆక్రమణల స్వాధీనానికి, అక్రమ భవనాల కూల్చివేతకు మేం వ్యతిరేకం కాదు. అయితే.. ఏది చేసినా చట్టపరంగా ఉండాల్సిందే. ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోం.” అంటూ కాస్త గట్టిగానే హైడ్రాకు వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు ధర్మాసనం.
గత విచారణ సందర్భంగా ఇచ్చిన ఆదేశాలతో హైకోర్టు ముందు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హాజరయ్యారు. రాజశేఖర్ తీరుపై కూడా న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యకం చేశారు. పోలీస్ శాఖను నుంచి డిప్యూటేషన్‌పై వచ్చినంత మాత్రాన అక్కడ వ్యవహరించినట్లు ఇక్కడ ఉంటామంటే కుదరదని రాజశేఖర్‌ను ధర్మాసనం మందలించింది. మరోసారి ఇలాగే జరిగితే మీపై చర్యలకు డీజీపీకి ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. అనంతరం విచారణను వాయిదా వేశార
అయితే.. గతంలోనూ సెలవు దినాల్లో కూల్చివేతలు చేపడుతున్నారంటూ పలువురు బాధితులు హైకోర్టును ఆశ్రయించగా.. కీలక ఆదేశాలు చేసిన విషయం తెలిసిందే. సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టొద్దని.. హైడ్రాకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంత ఆగమేఘాలపై సెలవు దినాల్లోనే కూల్చివేతలు చేపట్టాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. అయితే.. కోర్టు ఆదేశాలున్నప్పటికీ.. హైడ్రా అధికారులు అక్కడక్కడా సెలవుదినాల్లో కూల్చివేతలు చేపడుతుండటంతో.. హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది
హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం
- వాటి నమోదుకు రిజిస్టర్ పెట్టాలేమో!
- దోపిడీ దొంగల్లా వ్యవహరించొద్దు
- హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం
- భూముల రక్షణకు వ్యతిరేకం కాదు.. చట్ట ప్రకారమే జరగాలని స్పష్టీకరణ
చట్ట ప్రకారం చేయాలే తప్ప ఇష్టం వచ్చినట్లు కాద’ంటూ గురువారం హైడ్రా తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా ఏకపక్ష చర్యలను తప్పుబట్టింది. వీటన్నింటినీ నమోదు చేయడానికి రిజిస్టర్ పెట్టాల్సి వస్తుందేమోనని వ్యాఖ్యానించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే హైడ్రాను రద్దు చేస్తామని ఒక దశలో హెచ్చరించింది. ‘సరైన విచారణ నిర్వహించకుండా వారాంతాల్లో కూల్చివేతలకు పాల్పడుతున్నారు. దోపిడీ దొంగలు మాత్రమే అలా వ్యవహరిస్తారు. ఆక్రమణలు, అనుమతి లేని భవనాల కూల్చివేతకు మేం ఏ మాత్రం వ్యతిరేకం కాదు. కానీ ప్రతి దానికి చట్టం అంటూ ఉంటుంది. చట్టాలను అమలు చేసి తీరాల్సిందే’ అని తేల్చిచెప్పింది.
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలో మూడు గుంటల భూమిలోని షెడ్‌ను ఎలాంటి సమాచారం లేకుండా ఆదివారం కూల్చివేయడాన్ని సవాలు చేస్తూ ప్రవీణ్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు హైడ్రా ఇన్స్పెక్టర్ రాజశేఖర్ హైకోర్టు ఎదుట హాజరయ్యారు. హైడ్రా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. సెలవు రోజుల్లో కూల్చివేతలు జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘మీరు ప్రతిసారీ ఇలాగే చెబుతున్నారు. మళ్లీ అదే తప్పు చేస్తున్నారు. హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను లెక్కచేయకుండా వ్యవహరిస్తే హైడ్రాను రద్దు చేస్తాం’అని వ్యాఖ్యానించింది. గతంలో ఇచ్చిన యథాతథ స్థితి ఆదేశాలను పొడిగించింది. తదుపరి విచారణ మార్చి 5కు వాయిదా వేసింది. కాగా, హైడ్రా స్టాండింగ్ కౌన్సెల్‌గా కౌటూరి పవన్‌కుమార్‌ను ప్రభుత్వం నియమించింది. మూడేళ్ల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నార
Leave a Reply